వామ్మో.. పారిపోతున్న సింహాన్ని పట్టుకున్న యువతి.. వైరల్ వీడియో!

ఎవరికైనా సరే సింహం అంటే భయం ఉంటుంది. సింహాన్ని నేరుగా చూడాలంటే అది జూ లో తప్ప మరెక్కడా సాధ్యం కాదు. ఎందుకంటే అది క్రూర మృగం. ఒకవేళ అది పొరపాటున మీదికి వస్తే చాలు పరుగో పరుగు పెడతాం. ఎక్కడ మింగేస్తాదేమో అని ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతాం. కానీ తాజాగా ఓ యువతి ఏకంగా పారిపోతున్న సింహాన్ని పట్టుకుంది.

వామ్మో.. ఇదేంటి అని అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. నిజంగానే ఓ యువతి పారిపోతున్న సింహంను పట్టుకొని మరి వార్తల్లో నిలిచింది. ఇంతకూ అసలేం జరిగిందో చూద్దాం. మిడిల్ ఈస్ట్ దేశమైనా కువైట్ లో సబాహియా ఏరియాలో ఓ సింహం ఓ ఇంటి నుంచి పారిపోయింది. కారణం దానికి ఆ ఇల్లు నచ్చలేదు.

నిజానికి ఆ సింహం ను ఓ వ్యక్తి పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నాడు. ఇక దానికి ఇంట్లో ఉండటం భారం అయ్యింది. దాంతో అది పారిపోవాలని చూసింది. ఎవరు లేని సమయాన్ని చూసి మెల్లగా బయటకు పరుగులు తీసింది. అంతే సంగతి అది రోడ్డు పైకి రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.

ఇక ఆ సింహంకు ఎటు వెళ్లాలో దారి తెలియక పోవడంతో అక్కడే ఆగిపోయింది. ఇక సమాచారం తెలుసుకున్న ఆ ఓనర్ కూతురు అక్కడికి వచ్చి ఆ సింహంను ఎత్తుకొని తిరిగి తన ఇంటికి తీసుకెళ్ళింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోకు తెగ లైక్ లు కూడా వస్తున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *