సిద్ శ్రీరామ్ ఒక పాటకు ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసా?

Sid Shriram : సంగీత ప్రియులకు సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగునాట పలు పాటలకు ఊపిరి పోసి ఆ పాటలు కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యువ గాయకుడు పాట పాడితే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావాల్సిందే. అతని పాటలతో ఎంతో మంది యువతను ఆకట్టుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Sid Shriram
Sid Shriram

ఇతడికి మొదటగా హుషారు లో సినిమాలో “ఉండిపో రాదే” ఆ తర్వాత నిన్ను కోరి సినిమా లో “అడిగా అడిగా “గీత గోవిందంలో “ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె” టాక్సీవాలా సినిమాలో “మాటే వినదుగా” వంటి పలు పాటలు ఈ యువ గాయకుడుకి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇక ఈ గాయకుడి కి తెలుగు ఇండస్ట్రీ కంటే కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ర్యాపో ఉందని చెప్పవచ్చు.

ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘శ్రీవల్లి ‘ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనం చూశాం. ఇదిలా ఉంటే తన పాటలతో ప్రేక్షకులను బానిసలుగా చేసుకునే సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అంటే.. ఒక్కో పాటకు అక్షరాల 5 లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు తీసుకుంటాడని తెలుస్తుంది.

ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్స్ చాలా తక్కువగా ఉన్నారనే చెప్పవచ్చు. ఇక సిద్ పాడితే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో డైరెక్టర్లకు ఆ పాటల రుచి తెలుసు కాబట్టి వారి సినిమాలకు ఎంత డబ్బు ఖర్చు చేసి అయినా సిద్ శ్రీ రామ్ స్వరాన్ని పొందుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *