టీడీపీకి దివ్యవాణీ రాజీనామా..!

టీడీపీకి సినీనటి, అధికార ప్రతినిధి దివ్యవాణీ రాజీనామా చేశారు. పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. టీడీపీలో కొన్ని దృష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్ల పేర్కొన్నారు. ఇంత వరకూ తనను ఆదరించిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో పాల్గొన్న ఆమెకు మాట్లాడే అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. మహానాడు అనంతరం ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆమె ఇంటర్యూ ఇచ్చారు. తాను అన్నీ ఓపెన్ గా మాట్లాడతానని, అబద్ధాలు చెప్పడం రాదని పేర్కొన్నారు. అమాయకంగా గురుత్వాకర్షణ ద్వారా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు విజన్ నచ్చి పార్టీలో చేరానని, తాను దేవుని బిడ్డగా పరిగణించబడ్డానని తెలిపారు.

టీడీపీలో చేరిన తర్వాత రాజకీయాలు అంటే ఏంటో తెలుసుకుని, శక్తి మేరకు పని చేయగలిగానని అన్నారు. రానురాను పార్టీలో అన్యాయం జరుగుతోందని, అదే విషయాన్ని చాలా మంది చెప్పారని, అయినా తాను కంట్రోల్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో కళకు సంబంధించిన వాళ్లు ఎందుకు ఉండలేకపోతున్నారని ప్రశ్నించారు. మురళీమోహన్ ఏదో వ్యాపారాలు ఉండబట్టి కొనసాగుతున్నారని అన్నారు. రోజా, కవిత, జయసుధ, జయప్రద లాంటి వారు విధానం వేరు, తాను జీవించిన విధానం వేరు అని పేర్కొన్నారు. అధికారంలోని అధికార ప్రతినిధిగా తనను కూర్చోబెట్టారని తెలిపారు.

తన బిడ్డల పరిస్తితి, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా మహానాడు కసం పరగెత్తుకుంటూ వెళ్లానని అన్నారు. అర్థరాత్రి పూట వెళ్తే ప్రమాదాలు జరితే ఎవరు బాధ్యత వహిస్తారని తెలిపారు. అయినా తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదన్నారు. మహానాడు అయ్యాక ఏడ్చానని, ఏదైనా అయి చనిపోతే డెడ్ బాడీ పెట్టుకుని ఓట్లు అడుక్కుంటారేమోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ విన్న టీడీపీ నేతలు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ లోపే విషయాన్ని పసిగట్టిన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *