ఆ తల్లిదండ్రులపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన ధనుష్
హీరో ధనుష్.. తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కథానాయకుడే. హీరోగా, నిర్మాతగా, రైటర్‌గా రాణిస్తోన్న ధనుష్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ధనుష్‌ను ఓ సమస్య వేధిస్తోంది. ధనుష్ మా కొడుకేనంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. సినిమాలపై ఆసక్తితో చినప్పుడే ఇంటి నుంచి పారిపోయిన వచ్చాడంటూ ధనుష్‌పై కేసు వేశారు. అది అటు ఇటు తిరిగి మద్రాస్ హైకోర్టుకు చేరింది.
ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించింది చాలని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆ దంపతులకు నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా లీగల్ నోటీసులు పంపించారు. కాగా ధనుష్ తమ మూడో కుమారుడని.. నటుడిగా స్థిరపడిన నాటి నుంచి ధనుష్ తమకు ప్రతి నెలా రూ.65 వేలు పంపిస్తున్నారని ఆ దంపతులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో విసిగిపోయిన ధనుష్, ఆయన తండ్రి కసూర్తిరాజా.. తాజాగా ఆ దంపతులకు లీగల్ నోటీసులు పంపించారు.
గత అయిదేళ్లుగా ఈ కేసు నలుగుతూనే ఉంది. తాను తమిళ సినీ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడినని ధనుష్ కోర్టుకు విన్నవించాడు. తన పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా అని కోర్టుకు తెలిపారు. డీఎన్ఎ టెస్టులు చేయాలని కతిరేసన్ దంపతులు కోరారు. కానీ దానికి ధనుష్ ఒప్పుకోలేదు. పుట్టుమచ్చలు కూడా చెక్ చేయించారు. అలాగే భర్త్ సర్టిఫికేట్స్ కూడా చూపించారు. ఏవీ కూడా కేసును ఓ కొలిక్కి తీసుకురాలేదు. దీంతో మళ్లీ కేసు కోర్టు ముందుకు వచ్చింది. కదిరేసన్ దంపతులు మాత్రం కేసును వెనక్కి తీసుకునేదే లేదని, ధనుష్ తమ బిడ్డేనని, డీఎన్ఏ టెస్టులు చేస్తే నిజం తేలుతుందని అంటున్నారు.