బిగ్ బాస్ 5 తెలుగు విజేత సన్నీకి కరెంట్ షాక్… జాగ్రత్త సన్నీ అంటూ పోస్ట్ లు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంత గ్రాండ్ గా ప్రారంభం అయ్యిందో అంతే గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ ఐదులో విజేతగా బుల్లితెర నటుడు సన్నీ నిలిచాడు. తనదైన శైలిలో ప్రతిభ కనబరుస్తూ ఆసాంతం ఆకట్టుకున్నాడు. వంద రోజులకుపైగా జరిగిన షోలో విక్టరీ సొంతం చేసుకుని విన్నర్ గా నిలిచాడు సన్నీ. స‌న్నీ ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వంద రోజుల‌కి పైగా హౌజ్‌లో ఉన్న అత‌డు బ‌య‌ట ప్ర‌పంచంతో తెగ ముచ్చిటిస్తూ క‌నిపిస్తున్నాడు. ప‌లు ఛానెల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే సన్నీకి హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది. ఈ ప్రెస్‌మీట్‌లో సన్నీకి చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది.

current shock to bigg boss 5 winner sunny and news got viral

ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తో పాటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్ర‌మాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది చిన్నపాటి సంఘటనే అయినా సన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట వైరల్ గా మార్చేశారు. ఇక ఈ వీడియో చూసిన వారు జాగ్రత్త సన్నీ… అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా విజేతగా అవతరించిన సన్నీకి కింగ్‌ నాగార్జున బిగ్‌బాస్‌ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను, సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని… టీవీఎస్‌ బైక్‌ ను సొంతం చేసుకున్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *