అతన్ని చెప్పుతో కొట్టాలంటూ తమన్నా సెన్సేషనల్‌ కామెంట్స్..!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. తాజాగా ఓటీటీలో కూడా మొదలైంది. చాలా మంది పాత కంటెస్టెంట్స్‌ను మళ్లీ ఇందులో తీసుకున్నారు. గత సీజన్స్‌లో వచ్చిన వాళ్లే 10 మందికి పైగా ఉన్నారు. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్‌‌కు ఎంత మంది అభిమానులున్నారో.. అంతేమంది విమర్శకులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు కూడా బిగ్ బాస్ షోపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

tamanna simhadri sensational comments on cpi narayana

ఇక ఈ బిగ్ బాస్ షోను సీపీఐ నేత నారాయ‌ణ సైతం విమర్శిస్తుంటారు. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న ఈ షోను ఉద్దేశించి, నాగార్జున‌పైన తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. తాజాగా బిగ్ బాస్‌పై ఆయన చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపాయి. బిగ్ బాస్ అనేది లైసెన్స్ తీసుకున్న బ్రోత‌ల్ హౌస్ అంటూ ఆయ‌న కామెంట్ చేశారు.

tamanna simhadri sensational comments on cpi narayana

ఈ విమర్శలపై బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్, ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. నారాయణపై తీవ్ర విమర్శలు చేస్తూ అభ్యంతరకరంగా మాట్లాడారు. బిగ్‌బాస్‌‌ కి సంబంధించి ఓ టీవీలో డిబేట్‌ షో ఏర్పాటు చేయగా తమన్నా సింహాద్రి మాట్లాడుతూ..”బిగ్‌బాస్‌ షోను బ్రోతల్‌ హౌస్‌ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలి. ఈ షో వల్ల నాకు, ఇంకా ఎంతోమందికి గుర్తింపు వచ్చింది. ఉపాధి కూడా కలిగింది. సమాజంలో మాకంటూ ఓ సెలబ్రిటీ స్టేటస్ ఆ షో వల్లే వచ్చింది. ఒకవేళ షో నచ్చకపోతే ఆయన ఛానెల్‌ మార్చుకోవచ్చు” అని వ్యంగ్యంగా కామెంట్ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *