రక్షణ కల్పించాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వాసి వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ దాడిని వివరిస్తూ డిజిపికి లేఖ రాసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైసిపి వర్గీయుల దాడులు రాష్ట్రంలో పరిపాటి గా మారాయని అన్నారు. దాడులు, దూషణలు, బెదిరింపులు,హత్యల ద్వారా తమను విమర్శించేవారిని వైసిపి భయాందోళనలకు గురిచేస్తుందన్నారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయన్నారు. కంతేరుకు చెందిన వెంకాయమ్మ కుమారుడు వంశీపై తాజాగా దాడి వరుస ఘటనల్లో భాగమేన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించారంటూ గత నెల 16 తేదీన వెంకాయమ్మపై దాడి చేసిన వైసిపి వర్గీయులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని,  ఆ కారణంగానే ఇప్పుడు ఆమె కుమారుడు వంశీపై దాడి జరిగిందన్నారు. ఈ రోజు వైసిపి వర్గీయులు చేసిన దాడిలో తృటిలో వంశీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని, వెంకాయమ్మ కు కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేఖతో పాటు పలు వీడియోలను చంద్రబాబు జత చేశారు. అనంతరం వెంకాయమ్మతో చంద్రబాబు ఫోనులో మాట్లాడారు.

ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి తాడికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడికొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వెంకాయమ్మకు అండగా పీఎస్ కు టీడీపీ నేతలు వెల్లగా..అక్కడ టీడీపీ వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మా ఊరి గొడవతో మీకేం పని అంటూ టీడీపీ నేతలపై వర్గీయులు మండిపడ్డారు. సోమవారం చలో కంతేరుకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నేతలు కంతేరు వెళ్లనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *