హీటెక్కిస్తోన్న ఏపీ సినిమా టికెట్ వ్యవహారం.. నాని వ్యాఖ్యలకు బొత్సా కౌంటర్​

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలోనే నాని వ్యాఖ్యలపై వైకాపా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బోత్సా కౌౌెంటర్ వేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను సంప్రదించాలని.. సమస్యేంటో చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు.

botsa-satyanarayana-given-by-counter-to-nanis-comments

మార్కెట్​లో ఏదైనా వస్తువు కొంటే ప్రతి దానికి ఓ ఎమ్​ఆర్పీ రేట్ ఉన్నట్లే.. ప్రేక్షకులకు కనీస ధరతో సినిమా అందించాలని చూస్తున్నామని అన్నారు. ప్రజలు అవమానించాల్సిన అవసరం లేదని.. టికెట్​ ధరలు తగ్గిస్తే అవమానించడం ఎలా అవుతుందని ఎదురు ప్రశ్న వేశారు. మేమింతే ఎంత కావాలంటే అంత వసూల్లు చేస్తామంటే కుదరని.. సునిమా చూసే ప్రేక్షకులు సంతోషంగా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బొత్సా స్పష్టం చేశారు.

సినిమా టికెట్​ ధరల విషయంలో ఏపీ తీసుకొచ్చిన బిల్లను సవాలు చేస్తూ.. పలువురు డిస్టిబ్యూటర్లు హైకోర్టును సంప్రదించారు. హై కోర్టు కూడా జీఓను రద్దు చేయాలని ప్రకటించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తనకు నచ్చినట్లు చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే పులువురు సినీ ప్రముఖులు ప్రభుత్వ వైఖరిపై సెటైరికల్​గా స్పందించారు. తెలంగాణలో థియేటర్ పార్కింగ్ రేట్ల కంటే.. ఏపీలో సినిమా టికెట్ ధరలు తక్కువని అన్నారు. అందరికీ వరాలిస్తున్న జగన్​.. సినిమా వాళ్లను కూడా కాస్త పట్టించుకోవాలని కోరారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్లి ఆగుతుందో తెలియాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *