చదువు ఎవరూ దొంగిలించలేని ఆస్తి : సీఎం జగన్

చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని, ఎవరూ దొంగిలించలేని ఆస్తి చదువు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న విద్యాదీవెనను బుధవారం తల్లుల ఖాతాలో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. 10.82లక్షల మంది విద్యార్ధులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికి సంబంధించి రూ.709 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలలోకి జమ చేస్తున్నామన్నారు చదువు జీవన ప్రమాణాలను మార్చేస్తుందన్నారు.

 

చదవుతో పేదరికం నుంచి బయటపడతాయని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమాల్లో విద్యాదీవెన, వసతి దీవెన ఒకటని అభిప్రాయపడ్డారు. వందశాత అక్షరాస్యత ఉన్న సమాజాల్లో శిశుమరణాలు పూర్తిగా తగ్గుతాయని, విద్య ఉన్న కుటుంబాలకు, విద్య లేని కుటుంబాలకు చాలా తేడా ఉంటుందని తెలిపారు. చదువులకోసం పేదరికం అడ్డు రాకూడదని, చదువులు ఆపే పరిస్థితి రానే రాకూడదని తాను గట్టిగా నమ్మానని, ఫీజు రియింబర్స్‌ మెంట్‌మీద ఎప్పుడు మాట్లాడినా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన తన కళ్లముందు కనిపిస్తూ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలని, చదువులు కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదని అభిప్రాయ పడ్డారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణాల్లోని పేదలకోసం గతంలో నాయకులు కేవలం మాటలు మాత్రమే చెప్పేవారని, కానీ రాజశేఖర్ రెడ్డి పూర్తి రీయింబర్స్‌మెంట్‌తీసుకు వచ్చారని గుర్తు చేశారు.  తర్వాత వచ్చిన పాలకులు వేచి చూస్తే  మొక్కుబడిగా ఇచ్చారన్నారు.నాశనమైన పథకాన్ని బాగా మార్పు చేశామన్నారు. బోర్డింగ్‌ ఖర్చులు కూడా వసతి దీవెన కింద ఇస్తున్నామని, విప్లవాత్మక మార్పులతో విద్యా దీవెన అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *