హీటెక్కిస్తోన్న ఏపీ సినిమా టికెట్ వ్యవహారం.. నాని వ్యాఖ్యలకు బొత్సా కౌంటర్
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలోనే నాని వ్యాఖ్యలపై వైకాపా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బోత్సా కౌౌెంటర్ వేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను సంప్రదించాలని.. సమస్యేంటో చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు.
మార్కెట్లో ఏదైనా వస్తువు కొంటే ప్రతి దానికి ఓ ఎమ్ఆర్పీ రేట్ ఉన్నట్లే.. ప్రేక్షకులకు కనీస ధరతో సినిమా అందించాలని చూస్తున్నామని అన్నారు. ప్రజలు అవమానించాల్సిన అవసరం లేదని.. టికెట్ ధరలు తగ్గిస్తే అవమానించడం ఎలా అవుతుందని ఎదురు ప్రశ్న వేశారు. మేమింతే ఎంత కావాలంటే అంత వసూల్లు చేస్తామంటే కుదరని.. సునిమా చూసే ప్రేక్షకులు సంతోషంగా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బొత్సా స్పష్టం చేశారు.
సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ తీసుకొచ్చిన బిల్లను సవాలు చేస్తూ.. పలువురు డిస్టిబ్యూటర్లు హైకోర్టును సంప్రదించారు. హై కోర్టు కూడా జీఓను రద్దు చేయాలని ప్రకటించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తనకు నచ్చినట్లు చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే పులువురు సినీ ప్రముఖులు ప్రభుత్వ వైఖరిపై సెటైరికల్‌గా స్పందించారు. తెలంగాణలో థియేటర్ పార్కింగ్ రేట్ల కంటే.. ఏపీలో సినిమా టికెట్ ధరలు తక్కువని అన్నారు. అందరికీ వరాలిస్తున్న జగన్.. సినిమా వాళ్లను కూడా కాస్త పట్టించుకోవాలని కోరారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్లి ఆగుతుందో తెలియాల్సి ఉంది.