జాతీయ జెండా రంగుల గడ్డంతో అమితాబ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

Amitabh Bachchan: బాలీవుడ్ కింగ్ గా రాణించిన అమితాబచ్చన్ కు భారతదేశం అంతటా అభిమానులు ఉన్నారు. ఈయన అద్భుతమైన యాక్టింగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటాడు. ఈయన ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎటువంటి పోస్ట్ చేసినా వినూత్నంగా అభిమానులకు తెలియజేస్తూ వారి అభిమానాన్ని పొందుతాడు.

అలాగే ఈ సారి గణతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ తన పిక్ ను పోస్ట్ చేసాడు. ఈ సూపర్ స్టార్ మన జాతీయ జెండాలోని మూడు రంగులను గడ్డానికి వేసుకుని తన అభిమానులకు ఎవరూ ఊహించని విధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. బిగ్ బీ పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అమితాబ్ పోస్ట్ చేసిన ఈ పిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అలాగే ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానంటూ క్యాప్షన్ కూడా రాసాడు. ఇది చూసిన అభిమానులు వరుస కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే చాలామంది సినిమా యాక్టర్స్ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అమితాబ్ పోస్ట్ చేసిన ఫోటోకు కొద్ది సమయంలోనే చాలా లైకులు వచ్చాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

మొత్తానికి ఆయన పోస్ట్ చేసిన ఈ ఫోటో అభిమానులను ఎంతగానో నచ్చింది. అలాగే త్వరలో తన సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయని కూడా తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *