గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే.. ఆ రోడ్డు మీద కూడా జరిగింది..!
మనలో చాలా మంది కర్మా అనే కాన్సెప్ట్ ను నమ్ముతారు. దీని అర్థం ఎవరు చేసుకున్న పుణ్యానికి గానీ పాపానికి గానీ వారే బాధ్యులు అని దాని అర్థం. వారు మంచి చేస్తే మంచి జరుగుతుందని… చెడు చేస్తే చెడు జరుగుతుందని బాగా నమ్ముతారు. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా ఇలాంటి అని చెప్పాలి. ఇంకా బాగా అర్థం అయ్యేలా చెప్పాలి అంటే.. ఎవరు తీసిని గోతిలో వారే పడుతారు అని సింపుల్ గా చెప్పు కోవచ్చు. ఈ వీడియోను చూస్తే ఈ విషయం మీకు చాలా బాగా అర్థం అవుతుందని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. నెటిజన్లు దీనిని చూసి కర్మా ఫాలోస్ అని కామెంట్లు చేస్తున్నారు. వారు చేసిన పనికి కొందరు కోపం తెచ్చుకుంటే.. మరి కొందరు మాత్రం తెగ నవ్వు కుంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ఈ వీడియో ఓ సారి చూడాల్సిందే.
రోడ్డు మీద ఓ వ్యక్తి తనంతట తాను పోతున్నాడు. అందులోనూ అది రాత్రి సమయం కావడం వల్ల కొంచెం భయపడుతూ వెత్తున్నాడు. అయితే ఇంతలోనే ఇద్దరు వ్యక్తులు అతడి వెనుకనే స్కూటీలో వచ్చి… గట్టిగా తల మీద కొడుతారు. ఇంత వరకు బాగానే ఉన్న కొట్టిన వెంటనే వారు కూడా ఆ వ్యక్తితో పాటు స్కూటీ నుంచి కిందపడడం గమనార్హం. వారు తీసిన గోతిలో వారే పడ్డారు అని కొందరు కామెంట్ చేస్తే.. కర్మా ఫాలోస్ అని మరి కొందరు చేస్తున్నారు. మొత్తానికి వీడియో ఐతే మాత్రం తెగ వైరల్ అవుతుంది.