హవ్వా… ఇదే ఆచారం… మైనర్ బాలికకు వీధికుక్కుతో పెళ్లి …

సాధారణంగా పెళ్లీడుకొచ్చిన కూతురికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. మంచివాడు, ఉద్యోగం చేసేవాడు, అమ్మాయి బాగా చూసుకోనే వాడికిచ్చి వివాహం చేస్తాము. అంతేతప్ప.. కుక్కలకు ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరూ అనుకోరు. అలాంటి వింతే ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. మూఢ నమ్మకాల పేరుతో ఓ బాలికకు వీధి కుక్కతో పెళ్లిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

minar marriage with dog
minar marriage with dog

ఓ పక్క సాంకేతికపరంగా ప్రపంచం ఆధునిక టెకాల్నిజీతో అభివృద్ది చెందుతుంటే..మరోపక్క మూఢ నమ్మకాలతో కొంతమంది వింత ఆచారాలు పాటిస్తున్నారు. ఒడిశాలోని కరగోలా గ్రామానికి చెందిన ఓ చిన్నారికి ఏకంగా వీధి కుక్కతో వివాహం చేశారు. ఈ పెళ్లిలో ఊరంతా కలిపి సంబరాలు జరుపుకున్నారు.వింటుంటే ఆశ్చర్యం కలుగుతుందని కదూ.. వీధి కుక్కతో పెళ్లి ఎందుకు చేశారో తెలిస్తే..షాక్తో పాటు నవ్వుకుడా వస్తుంది.

బాలికకు పాలదంతాలు మొదట దవడ భాగంలో వచ్చాయి. అది ఆశుభానికి గుర్తుగా భావించి.. కుక్కతో వివాహం చేశారు. ఇలా చేయడం వల్ల మంచి రోజుల వస్తాయంటా.. లేదంటే భవిష్యత్తులో బాలిక సమస్యలు ఎదుర్కొంటుందని అక్కడ గిరిజనుల నమ్మకం. దవడ భాగంలో పాల దంతాలు ఎవరికి వచ్చిన ఇలాగే చేస్తామంటున్నారు అక్కడి గిరిజనులు. అభం శుభం తెలియని ఆ చిన్నారికి కుక్కతో వివాహం ఏంటి అనిీ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే తమ ఆచారం తమదే అని అంటున్నారు గిరిజనులు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్లతో పోస్టులు పెడుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *