మొసలితో పరాచకాలు.. పిల్లి ధైర్యం చూస్తే షాక్.!

సోషల్ మీడియాలో ప్రతిరోజుల ఏదో ఒక వీడియో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే మరికొన్ని భయపెట్టిగా కూడా ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సాధారణంగా మనం మొసలి చూస్తే భయపడతాం. అలాంటి దగ్గరకు వెళ్లాలంటే.. ఇంకేమైనా ఉందా.. అంతటి సాహసం చేయడం కాదు కాదా.. ఆలోచించడానికే భయపడతాము. కాని ఓ పిల్లి చేసి తన సాహసాన్ని నిరూపించింది.

Brave Cat Narrowly Escapes With Fish From Crocodile's Bulls Eye Viral Video Shocks You Definitely
Brave Cat Narrowly Escapes With Fish From Crocodile’s Bulls Eye Viral Video Shocks You Definitely

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో లోని.. మొసలిని చూడండీ. ఓ నది దగ్గర సేద తీరుతుంది. అయితే దాని నోటి దగ్గర ఓ చేప పిల్ల ఉంది. అంతే అది చూసిన ఓ పిల్లి సడన్ గా ప్రత్యేక్షమైంది. మీకు తెలుసో లేదో ..నాన్ వెజ్ అంటే పిల్లలు అమితంగా ఇష్టపడతాయి. అలాంటి చేపలను చూస్తే అసలు పిల్లలను అపడం కష్టం. ఎలాగైన మొసలి దగ్గర ఉన్న చేపను తీసుకునేందుకు ఏకంగా దానికి దగ్గరకే వెళ్లింది ఓ పిల్లి. మొసలిని గమనిస్తూ.. అక్కడ ఉన్న చేపను టక్కున నోటితో పట్టుకుని అక్కడి నుంచి పరారైంది.

https://www.instagram.com/reel/Ca7itQwlGwt/?utm_source=ig_embed&ig_rid=37efc102-03a3-4714-b168-99c010269073

మొసలి గాఢనిద్ర లో ఉందనుకుంటా పిల్లి వచ్చిన శద్దం కూడా అంతగా గమనించలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారు 4వేలకు పైగా లైకులు వచ్చాయి. పిల్లి చేసిన సాహసానికి మెచ్చుకుంటూ నెటిజర్లు కామెంట్స్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *