పుచ్చకాయతో ప్రయోజనాలు

పుచ్చకాయ…సమ్మర్ వచ్చిందంటే అత్యధికంగా డిమాండ్ ఉండే ఫ్రూట్ ఇది. చిన్నాపెద్దా సంబంధం లేకుండ ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు దీన్ని. గిరాకీ కూడా దీనికి అలాగే ఉంటుంది. ఇందులో నాలుగు రకాల విటమిన్స్ ఉంటాయి. అంతేకాదు రకరకాల పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఎండాకాలంలో పుచ్చకాయ తినడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. సాధారణంగ గుజ్జుతిని విత్తనాలు అందరూ పడేస్తారు.కానీ వాటిల్లో కూడా ప్రయోజనాలు దాగున్నాయి.  పుచ్చకాయ, దాని విత్తనాల వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

గుండెపోటుకు మొదట రక్తపోటు వస్తుంది. పుచ్చకాయ గింజల్లో లభించే పొటాషియం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ఇప్పట్లో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కంటి అద్దాలు వాడాల్సి వస్తోంది. దీనికి కారణం కంటి చూపు తగ్గడమే కారణం. అయితే పుచ్చకాయ కూడా కంటిని రక్షిస్తుంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి కంటికి చాలా మంచిది. వీటిని రోజూ, పరిమాణంలో తీసుకుంటే  కంటిశుక్లం తగ్గించవచ్చు.

అంతేకాదు.. ఫోలేట్‌ పదార్థం ఉండటం వల్ల గర్భిణిలు హైడ్రెట్ గా ఉండేలా సహాయపడుతుంది. కడుపుతో ఉన్నప్పుడు నిపుణుల సలహా మేరకే తీసుకోవాలి.  కడుపు మంట సమస్యల నుండి ఉపశమనం పొందడంలో పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు మామయవుతాయి. మెదడులో రక్త ప్రసరణ  కూడా మెరుగుపడుతుంది. ఇది  మైండ్ ను ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే దీన్ని  విరివిగా తీసుకోవడం వల్ల మూత్రం అధికంగా వస్తుంది. ఏది తీసుకున్నా నిపుణుల సలహా మేరకు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *