ఓవర్ నైట్ స్టార్ అయిన బెలూన్ సేల్స్ గర్ల్.. !

అదృష్టం ఎప్పుడు ఏవరిని వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు కష్టాలతో పోరాడిన వారి జీవితం ఒక్కసారిగా ములుపు తిరిగి స్టార్లుగా మారిపోతారు.  అందుకే పెద్దలు అంటారు. ఎంత కష్టపడినా ఆవగింజంత లక్కు ఉండాలని. అయితే ఆవగింజ లక్కు కాస్తా గుమ్మడి కాయల ఉంటే.. ఎలా ఉంటుంది. ఉహించడానికి  చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు అలాంటి వీడియోనే నెట్టింల్లో వైరల్ గా మారింది. ఇంతకి ఆ అదృష్టవంతులు ఎవరనేగా మీ డౌట్..

Balloons sales girl turned model in over night
Balloons sales girl turned model in over night

జనవరి 17న కేరళ లోని అందలూరుకాపు లో జరిగిన ఓ జాతర లో కస్బూ అనే యువతి దినసరి కూలీగా.. బెలూన్స్ అమ్ముతుంటుంది. అటుగా వెళ్తున్న.. ఫోటోగ్రాఫర్ అర్జున్ కృష్ణన్.. ఆ యువతిని చూసి ఓ ఫోటో తీశాడు. అనంతరం ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతే పోస్ట్ చేసిన గంటలోనే ఫోటోలు వైరల్ గా మారిపోయాయి అంతేకాదు ఆ యువతి ఇంటికి వెళ్లి మరీ తన తల్లికి ఫోటో చూపించాడు అర్జున్ కృష్ణన్. దీంతో తన కూతురిని చూసి ఆ తల్లి ఆనందంతో మురిసిపోయింది.

అయితే అర్జున్ కృష్ణన్.. కిస్బూ వాళ్ల అమ్మను ఓప్పించి.. ఈసారి మోడలింగ్ రూపంలో మేకప్ వేసి ఫోటో షూట్ చేశాడు. ఆనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే అ ఫోటోలను చూసిన..కొన్ని కంపెనీలు ఆమెను మోడల్ గా తీసుకునేందుకు మందుకు వస్తున్నారు. మరోవైపు ఆమె పోటో తీసిన అర్జున్ కృష్ణన్ ను సోష ల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తున్నారు. గ్రేట్ జాబ్ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *