బావ చంద్రబాబు బాధను బాలయ్య పట్టించుకోలేదా… కారణం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అతని కొడుకు లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.అయితే చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపు కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం పై ఎప్పుడూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే టిడిపి అధికారుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఒంటరిగా వైసిపి సవాళ్లను ఎదుర్కొని ఉంటారు.

గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని అవమానించారని మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడంతో నందమూరి ఆడపడుచు అవమానం జరిగిందని నందమూరి హీరోలు, నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఈ విషయంపై స్పందించి వైసీపీ నాయకుల పై ఘాటు విమర్శలు చేశారు. ఇలా మీడియా ముందు వైసీపీ అధికారులను హెచ్చరించారు.

ఇలా భువనేశ్వరికి అవమానం జరగడంతో అందరి మాదిరి బాలకృష్ణ కూడా ఆ ఒక్క రోజు స్పందించి ఆ విషయం గురించి మర్చిపోయారు. ఇలా బావ బాదను చివరికి బాలకృష్ణ కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాలపై కాకుండా తన దృష్టి మొత్తం సినిమాల పై పెట్టారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అఖండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ గత కొన్ని రోజుల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *