49 మంది ఎమ్మెల్యేలు పక్కపార్టీతో టచ్ లో ఉన్నారు : హీరో శివాజీ

హీరో శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఇతర పార్టీతో టచ్ ల్ ఉన్నారని నడుటు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ గతి పట్టిందని అన్నారు. బీజీపీ హయాంలో మందిర్, మసీదు మాత్రమే తెచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలని కోరారు.

ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఉన్నాయని, గతంలో హోదాయే ఊపిరి అని ఇప్పుడు మాట్లాడటం మానేశారని ఆక్షేపించారు. హోదా కోసం అందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పాలించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. ఒక్కో ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా ఈ సారి వైసీపీకి ఓటు వేయరని జోష్యం చెప్పారు. కేంద్రానికి అధిక మెజార్టీ ఉందని, ఏపీ హక్కులను దిస్తారా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లోనూ కులం గురించి మాట్లాడుతున్నారని, ఇది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్ధులకు కులం అవసరంలేదన్నారు.

శివాజీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన గత ఐదేళ్లుగా ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నారు. గతంలో తాను చేరిన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు. హోదా వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకుతాయని నిత్యం టీవీ చర్చల్లో శివాజీ పిలుపునిస్తారు. అయితే ఈ సారి ఏదైనా పార్టీ నుండి పోటీ చేయాలని శివాజీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీలో చేరతారా..లేదా మద్ధతు ఇస్తారో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *