క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్వీటీ బ్యూటీ అనుష్క సంచలన కామెంట్స్‌..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి వెండితెరపై పలకరించి చాన్నాళ్లయింది. 2020లో నిశబ్దం సినిమా తర్వాత ఎటువంటి అప్‌డేట్‌ లేదు. ప్ర‌స్తుతం యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతుంది. కాగా క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్వీటీ స్పందించారట. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనుష్క.. క్యాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

anushka shetty comments on casting couch

భారత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కోన్న వేధింపుల గురించి ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరుతో ఇప్పటికే ఎంతో మంది బయటపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మహిళలు తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. కాస్టింగ్ కౌచ్ అనేది అన్నీ రంగాల్లోనూ ఉండగా.. మీడియా కార‌ణ‌మో, మ‌రేదైనా కార‌ణ‌మో కానీ.. సినీ ప‌రిశ్ర‌మ‌పైనే ఫోక‌స్ ఎక్కువైంది.

anushka shetty comments on casting couch

తాజాగా అనుష్క క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఈ విధంగా స్పందించారట. తెలుగు సినీ పరిశ్రమలో ఉందని తాను అంగీకరిస్తున్నాను అని చెప్పారట. ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ… ‘నిజమే టాలీవుడ్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి.. హీరోయిన్‌లను లోబర్చుకునే సంస్కృతి ఉంది. నేను కూడా అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే నేను చాలా సూటిగా, నిక్కచ్చిగా ఉంటాను. అందుకే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆమె ఎప్పుడు చేశారన్నది తెలీదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. కాగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను సూప‌ర్ సినిమాతో ప‌ల‌క‌రించిన అనుష్క శెట్టి త‌న‌ అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అరుంధ‌తి చిత్రంతో టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది అనుష్క శెట్టి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *