కొరియోగ్రాఫర్ యానీ మాస్ట‌ర్ కి మళ్లీ కరోనా.. బాగా జరిగిందంటూ నెటిజెన్ శాపం!

Anee Master: మాస్టర్ మహిళా కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని మంచి గుర్తింపు పొందింది. అదే విధంగా బిగ్‌ బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ఈమె తాజాగా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది.

అయితే ఆమెకు కరోనా రావడం ఇది రెండోసారని.. గతేడాది క‌రోనా వచ్చి జనవరి 23న తగ్గిపోయిందని.. మళ్లీ ఈ ఏడాది జనవరి 24న కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించింది. ఇక ఈ కరోనా ఏమైనా టైం మెయింటెన్ చేస్తుందా? క్వారంటైన్ చికాకుగా చాలా బోరింగ్ గా ఉందని.. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

అయితే ఆమె పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను చూసినవారు రెండోసారి కరోనా బారిన పడిన ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే ఒక నెటిజన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా విమర్శించింది. యానీ మాస్టర్ కు తగిన శాస్తి జరిగిందని నెగిటివ్ కామెంట్ చేసింది.

సన్నీకి సపోర్ట్ చేయలేదు కదా, నీకు క‌రోనా రావాల్సిందేనని శాపనార్థాలు పెట్టింది. ఈ మెసేజ్ ను చూసి యానీ మాస్టర్ స్క్రీన్‌షాట్‌ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఆ నెటిజెన్ మెసేజ్ కు ఘాటుగా స్పందిస్తూ నువ్వు ఇంకా ఎదగాలి అంటూ కౌంటర్ ఇచ్చింది. స‌న్నీ బాబా నాకు కోవిడ్ పోయేలా ఏదైనా చెయ్యొచ్చుగా అని కామెంట్ కూడా చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *