ఒమిక్రాన్ వేరియంట్‌కు త్వరలోనే నెల్లూరు ఆనందయ్య మందు సరఫరా
మహమ్మారి కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకునే లోపు మరో వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతుంది. అదేనండి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు తాజాగా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు అప్రమత్తమై కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే (21) మంగళవారం నివేదికల ప్రకారం భారతదేశం లో 200 మంది ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడ్డారని వైద్య నిపుణులు నివేదించారు.
మహమ్మారి కరోనాకి నాటు వైద్యం చేసి ఎంతోమంది హృదయాలలో దేవుడిలా నిలిచారు ఆనందయ్య. తాజాగా నెల్లూరు ఆనందయ్య కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని మీడియా ద్వారా తెలిపారు. గతంలో కరోనా కి తయారుచేసిన మందుకు మరికొన్ని మూలికలను జోడించి ఈ మందును తయారు చేశామని, ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా పేదలందరికీ తన మందును ఉచితంగా అందిస్తామని అలానే ఎక్కువ మోతాదులో కావాలంటే ప్రత్యేకంగా తయారు చేసిస్తామన్నారు. తన మందు వల్ల ఎలాంటి దుష్ర్పభవాలు కలగవని ఆనందయ్య తెలిపారు.అయితే ఒమిక్రాన్ వల్ల 50 రకాల బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం సెకండ్ వేవ్ లో ఇచ్చిన మందు కంటే ఒమిక్రాన్ కట్టడి కోసం మరిన్ని అదనపు మూలికలు ఉపయోగిస్తున్నాం.నూటికి నూరు శాతం ఒమిక్రాన్ పై మా మందు పనిచేస్తుంది. నమ్మకం ఉన్న వారికే మందు అందిస్తాం అలానే ఆయుష్ నుంచి అనుమతులు వచ్చాక ఆన్లైన్ లో కూడా లభిస్తుందన్నారు. ఇదిలా ఉంటే గతంలో కరోనా మందుపై అల్లోపతి నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానిపై స్పందించిన ఆనందయ్య వారి మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.