గతంలో రెండు సర్జరీలు చేయించుకున్న అల్లు అర్జున్.. అందుకే పుష్ప సినిమాలో ఇలా?
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పుష్ప కథను సుకుమార్ తనకు చెబుతున్నప్పుడు తన ఎడమ భుజం పైకి పెట్టుకొని నటించాలని వివరించారు. ఇలా ఈ సినిమాలో తన ఒక అంగవైకల్యంతో బాధపడే వ్యక్తిగా నటించాలని చెప్పడంతో ఓకే అన్నాను.
ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాక ఒక వారం రోజులపాటు ఎడమ భుజం ఎలా పైకి పెట్టుకొని షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక వారం రోజులపాటు ఎంతో నొప్పి వేసి చాలా ఇబ్బంది పడ్డానని అయితే ప్రస్తుతం అలా నటించడానికి తనకు అలవాటు అయిందని అల్లు అర్జున్ తన ఎడమ భుజం గురించి వెల్లడించారు. అయితే గతంలో 2005, 2011వ సంవత్సరంలో తన ఎడమ భుజానికి రెండుసార్లు సర్జరీ జరిగిందని అలా సర్జరీ జరగడం వల్లే ఈ సినిమాలో భుజం పైకి పెట్టుకుని నటించడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు.
ఇలా రెండుసార్లు ఎడమ భుజానికి సర్జరీ కావటం వల్ల మొదట్లో తన భుజం నొప్పి ఉండేదని అయితే సినిమా కోసం ఆ నొప్పిని భరించి ఈ షూటింగ్ లో పాల్గొన్నానని ఈ సందర్భంగా అల్లుఅర్జున్ తనకు జరిగిన సర్జరీ గురించి బయట పెట్టారు. ఇక 2011 సంవత్సరంలో తనకు జరిగిన సర్జరీ కారణంగా ఏకంగా సంవత్సరం పాటు ఇంటికే పరిమితం అయ్యాయని ఈ ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ పుష్ప సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వివరించారు.మరి బన్నీ ఈ సినిమా కోసం పడిన కష్టానికి ఫలితం దక్కుతుందా? లేదా? అనే విషయం తెలియాలంటే డిసెంబర్ 17వ తేదీ వరకు వేచి చూడాలి.