ఆ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ కు వెళ్తున్న కింగ్ నాగార్జున!

Akkineni Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేక మ్యానరిసమ్ తో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. ఇక టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇదిలా ఉంటే నాగార్జున నటించే నెక్స్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రానికి గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున రిటైర్డ్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

మంచి గడ్డం, స్టైల్ గా మేలు తిప్పిన మీసాలతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తయింది. కానీ కొంత వరకు గ్యాప్ రావడంతో నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది.

ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. కాగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను దుబాయ్ లో షూట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్ర బృందం దుబాయ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ యాక్షన్ కొరియోగ్రాఫర్ నుంగ్ ద్వారా యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్‌ ను హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *