బాలీవుడ్‌ ఎంట్రీపై మహేశ్‌ బాబు క్లారిటీ.. అటు ఒకేరోజు 30 మందికి..!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ” సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. దానిని పాన్ ఇండియా రిలీజ్ చేసేలా తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక తెలుగు సినిమాలతో హిందీలోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్న మహేష్ ఇప్పటి వరకూ బాలీవుడ్‌లో సినిమా చేయలేదు. బాలీవుడ్ డెబ్యూ గురించి ఎప్పుడు ప్రశ్నించినా… ”తెలుగు సినిమాలతో హ్యాపీగా ఉన్నాను” అని మహేష్ బాబు చెప్పేవారు.

Mahesh babu on making his bollywood debut

మరోసారి ఆయనకు అదే ప్రశ్న ఎదురైంది. హైదరాబాద్‌లో జరిగిన ఒక యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ బాబుకు మరోసారి హిందీ సినిమా ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న అడిగినది ముంబై మీడియాకు చెందిన వ్యక్తి. “మీరు ముంబై నుంచి వచ్చారు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు హిందీ చేయాల్సిన అవసరం లేదు. నేను హ్యాపీగా తెలుగు సినిమా చేసి… ప్రపంచమంతటా విడుదల చేయవచ్చు. ఇప్పుడే అదే జరుగుతోంది. నా వరకూ వస్తే… తెలుగు సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను” అని మహేష్ బాబు ఆన్సర్ ఇచ్చారు.

ఇక మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టారే. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేష్ బాబు.. మరో మంచి పనికిి నాంది పలికారు. ఏకంగా ఒకేరోజు 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు నమ్రత. ఏపీ గవర్నర్, ఆంధ్ర ఆసుపత్రికి నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని చిన్నారులందరికీ గుండె ఆపరేషన్లు చేయించారు మహేష్ బాబు.. ఈ విషయాన్ని నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ ఉదారతపై అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఎంబి ఫౌండేషన్ పేరుతో మహేష్ బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *