గాలిలో గందరగోళం చేసిన యువతి.. వైరల్ వీడియో!
Viral: ఎవరికైనా ఎత్తైన ప్రదేశాలు, ఎత్తైన కొండలు అంటే చాలా భయం ఉంటుంది. కొంతమందికి మాత్రం ఎత్తయిన ప్రదేశాలను చూస్తే వాటి దగ్గరకు వెళ్లాలి అనిపిస్తుంది. ఇక కొందరు పైకి ధైర్యంగా వెళ్లి కిందకు చూడాలంటే భయపడతారు. దీన్ని ఆక్రోఫోబియా అని అంటారు. సాధారణంగా ఇలాంటి భయం ఉన్న వాళ్ళు పారాగ్లైడింగ్ చేయడానికి భయపడతారు. కొందరు పైకి వెళ్ళిన కొద్దీ గాలిలో ఉండే పాటికి భయం మొదలవుతుంది.
ఇదే తరుణంలో ఓ మహిళ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆకాశం లోకి వెళ్ళిన తర్వాత ఆమె చాలా ఎక్కువగా భయపడింది. ‘భయ్యా నాకు చాలా భయమేస్తుంది. నేను కిందకు చూడలేకపోతున్నాను’ అంటూ బాగా భయపడిపోయింది. కానీ ఆ ఇన్‌స్ట్రక్టర్ ‘భయం ఎందుకు నేను ఉన్నాగా కూల్ గా ఉండండి. మీరు కిందకి చూసే అవసరం లేదు.
పైకి చూడండి.. లేకపోతే ముందుకు చుడండి, అదీ కాకపోతే కెమెరావైపు చూడండి’ అంటూ ధైర్యం చెప్పాడు. అయినప్పటికీ ఆమె..’నాకు చాలా భయంగా ఉంది. నేను కెమెరా ని పట్టుకోలేకపోతున్నా’ అంటూ ఆమె గందరగోళం చేసింది. దాంతో ఇన్‌స్ట్రక్టర్ ఆమె చేతిలో ఉన్న సెల్ఫీ స్టిక్ ను తీసుకొని పట్టుకున్నాడు. ‘ మీరు భయపడేది రికార్డు అవుతుంది. మీ వీడియో క్లిప్ కూడా గతంలో ‘ల్యాండ్ కరా దే ‘ వీడియో లాగా వైరల్ అవుతుంది.
Paragliding is Amazing, isn’t it ? pic.twitter.com/Y6pKUx35sa
— Dr. M V Rao, IAS (@mvraoforindia) January 15, 2022
అని ఇన్‌స్ట్రక్టర్ చెప్పడంతో.. ఆమె పెద్దగా నవ్వి, ఆమె పారాగ్లైడింగ్ ను అసలు ఎంజాయ్ చేయలేక పోయింది. అంతేకాకుండా విపరీతంగా టెన్షన్ పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.