పాట నచ్చలేదని వధువుకి అక్కడికక్కడే విడాకులిచ్చిన పెళ్ళికొడుకు!

Divorce: కొన్ని సంప్రదాయాల ప్రకారం పెళ్ళికొడుకు వైపు వారు పెళ్లికూతురు చూసుకోవడానికి వచ్చి పెళ్లి కూతురిని ఒక పాట పాడమని అడుగుతారు. దానికి పెళ్లికూతురు తలదించుకుని ఒక పాట పాడి మెప్పిస్తుంది. కానీ ఇప్పుడు అప్డేట్ అయిన కాలంలో ట్రెండ్ మారింది. కొత్త డీజే డాన్స్ లతో పెళ్లి కూతురు సైతం లేచి ఆడాల్సిందే.

Divorce
Divorce

ఇదే తరుణంలో ఇరాక్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడ జరిగిన ఓ పెళ్లిలో పెళ్లి కూతురు డాన్స్ కు పెళ్లి కొడుకు అక్కడికక్కడే విడాకులు ఇచ్చాడు. ఇరాక్ లో పెద్దల సమక్షంలో బంధుమిత్రుల హడావిడితో ఓ వ్యక్తి పెళ్లి జరిగింది. ఇక ఆ రోజు రాత్రి జరిగిన కార్యక్రమంలో పెళ్లి కూతురు డాన్స్ చేసింది.

పెళ్లి కూతురు చేసిన డాన్స్ చుసిన పెద్దలు పెళ్ళికొడుకుని బాగా మెప్పించిందని అనుకున్నారు. కానీ అక్కడే వచ్చింది పెద్ద చిక్కు. పెళ్లి కూతురు డాన్స్ చేసిన పాట అర్ధం ‘నీ పై నేను పెత్తనం చలాయిస్తాను నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. నేను అహంకారిని’ అని అర్థంతో ఉంది. ఈ అర్థం తెలుసుకున్న వరుడు ఇంకెక్కడ ఆగుతాడు.

పెళ్లికూతురు కుటుంబంతో వాదానికి దిగాడు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి పెళ్లికూతురుకి అక్కడక్కడే విడాకులు ఇచ్చేశాడు. దీంతో అక్కడ ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. గతంలోనూ ఓ పెళ్లిలో ఇదే పాట పాడడం కారణంగా జోర్దాన్ అనే వ్యక్తి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడని తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *