నేను రేప్ చేయగలనా అంటూ రోజాపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు..!

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మహానాడు సభ వేదికగా సీఎం జగన్, మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలు కొందరిని ఇశ్చర్యానికి గురి చేయగా, మరి కొందరిలో నవ్వులు పూయించాయి. ఇంతకీ ఏమన్నారో చూద్దాం. తనపై రేప్ కేసు పెట్టారని, పోలీసులకు చట్టం తెలుసా అని ప్రశ్నించారు. ఈ వయసులో నేను రేప్ చేయగలనా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు మగాళ్లు కాదని రోజు అంటోందని, తాము మగాళ్లం కాదన్న విషయం రోజాకు ఎలా తెలుసని అన్నారు. అయ్యన్నపాత్రుడు మగాడు కాదా..ఒక సారి చూడు మరి అని చెలరేగిపోయారు.

మగాడో..కాదో తెలియాలంటే ఒకసారి టెస్టు చేయాలని, నాతో టెస్టు చేయించుకుంటావా..మా లోకేష్ తో టెస్టు చేయించుకుంటావా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఏంచేస్తారు..రేప్ చేస్తారా అని రోజా అనడం ఒక మహిళా మాట్లాడే మాటేనా అని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడని, చీరలు ఎవరికి కొనిస్తారని హెచ్చరించారు. రోజా మొగుడుకి చీరలు కొనిచ్చి ఇంట్లో కూర్చోబెట్టిందని మండిపడ్డారు. ఏపీలో ఉన్న మగాళ్లకు రోజా చీరలు కడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ..బ్రాందీ షాపులపై అప్పులు తెచ్చిన ఏకైక దౌర్భాగ్యుడు జగన్ అని విమర్శించారు. బ్రాందీ షాపుల్లో ఉన్న బ్రాండ్లన్నీ రేట్లు అడిగేవి ఉన్నాయని, నా కొ….ఏం పేర్లండవీ అని విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా నాటుసారా, గంజాయి, మత్తుమందు కనిపిస్తోందన్నారు. గంజాయి అమ్మేవాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు.? డబ్బుల దెం…వదిలేస్తున్నారా అని విమర్శించారు. ఎంతమంది యువత జీవితాలు నాశనం చేయాలని ఉన్నారని ప్రశ్నించారు. ఐదు లారీల గంజాయి వెళ్తుంటే ఒక లారీ పట్టుకుని నాలుగు లారీలకు డబ్బులు దెం…అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *