జగన్ మౌనం రైతాంగానికి శాపం : మాజీ మంత్రి దేవినేని
జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందని, జోకర్ లాంటి జలవనరుల మంత్రితో పిచ్చిమాటలు మాట్లాడిస్తేసరిపోదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబుని, దేవినేని ఉమాని తిడితే పోలవరం పూర్తికాదన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం, డబ్బువ్యామోహం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు తగ్గిస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరుతెరవలేదన్నారు.? ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్నదానికి ప్రతిఫలంగా పోలవరాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం నిర్మాణంపై పొరుగురాష్ట్రవ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి అసమర్థతకాదా? అని ప్రశ్నించారు.
‘‘టీడీపీప్రభుత్వంలో వెదిరే శ్రీరామ్ అడ్రస్ లేడు.టీడీపీ హాయాంలో రూ.55,548కోట్లకుప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఆమోదం పొందితే, ఇప్పుడు వెదిరేశ్రీరామ్ రూ.9వేలకోట్లు చాలంటే విజయసాయిరెడ్డి మూసుక్కూర్చున్నాడు. 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021, 2022 జూన్ , 2023 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ఎలా చెప్పారు? సీబీఐ, ఈడీ కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా? ప్రధానమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి ఎందుకు రూ.55,548కోట్లు సాధించలేకపోతున్నాడు? 800కోట్లతో గుంతలుపూడుస్తాము.. 2వేలకోట్లతో నీళ్లుతోడతామంటూ ఎన్నాళ్లుకబుర్లు చెబుతావు రాంబాబు? పోయిన మంత్రేమో బుల్లెట్ దిగుద్ది అన్నాడు.. వచ్చినమంత్రికేమో పులిచింతల చూడగానే నోరుపడిపోయింది.
పులిచింతల గేట్ కొట్టుకుపోయి నెలరోజులైతే ఏం చేస్తున్నావు రాంబాబు? మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ పూర్తిచేశారా? 6 ప్రాధాన్యతాప్రాజెక్ట్ ల్లో ఎన్నిపూర్తిచేశారు? పరిపాలన చేతకాకపోతే రాజీనామాలు చేసిఎన్నికలకు వెళ్లండి. మీలాంటి వారుకోటలో ఉన్నా.. పేటలోఉన్నా ఒకటే. పక్కరాష్ట్రవ్యక్తి పోలవరంపై రివ్యూచేస్తుంటే ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో చేతులుకట్టుకొని కూర్చుంటాడా? నిర్వాసితులసొమ్ముని వైసీపీవారు పందికొక్కుల్లా తింటుంటే ముఖ్యమంత్రికి, రాంబాబుకి కనిపించడంలేదా? ఎత్తిపోతల పథకాల్లోని లొసుగుల్ని ఎత్తిచూపినవారిని తిడితే రైతులకు నీళ్లుఅందవు రాంబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతిరాస్తేనే నిర్వాసితులసమస్యలు, ప్రాజెక్ట్ నిర్మాణంలోని దుస్థితి బయటపడింది.’’ అని ధ్వజమెత్తారు.