మగవారి ముఖంలోని మొటిమలు మాయం చేసే మహిమలు..
యుక్త వయసులోకి అడుగుపెట్టగానే చాలా మందికి ముఖంపై మొటిమలు, మచ్చల వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముఖ సౌందర్యాన్ని పాడు చేయడంలో ఈ మొటిమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. అయితే, అనుకున్నన్నీ ఫలితాలు ఉండవు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మీ ముఖం అందంగా తయారవుతుంది. అవి ఏంటో చూసేద్దామా…
ముందుగా తులసి ఆకులు మరియు వేప ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత చందనం, కొద్దిగా నీళ్లు పోసి బాగా క్రీములాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలాగే కొన్ని రోజుల పాటు కొనసాగిస్తే మొటిమలు వెంటనే మాయమవుతాయి. ఇంకొక చిట్కా ఏంటంటే ముందుగా తులసి ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ముల్తానీ మజ్సెల్స్ మరియు మజ్జిగ కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటిని ముఖంపై పోసుకుంటూ నానబెట్టాలి. అంతా తడిచిన తర్వాత కడిగేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి 1 లేదా 2 సార్లు అప్లై చేయడం వల్ల జిడ్డు చర్మం నుండి మంచిగా మారుతుంది. ఇక బంగాళాదుంపలను తురుముకుని, రసం పిండుకోవాలి. తర్వాత మెత్తగా పొడిలా రుబ్బుకోవాలి. తర్వాత ఆ పొడిలో తులసిని మధ్యలో గ్రైండ్ చేసి కలపాలి. చివరగా పాలు లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు మాయమవుతాయి.ఇంకెందుకు ఆలస్యం పై చిట్కాలు పాటించి, మీ సౌందర్యాన్ని కాపాడుకోండి.