సూర్య-జ్యోతికపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..!

తమిళ స్టార్‌ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన ‘జై భీమ్‌’ చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించారు.

Court orders FIR against Suriya, Jyothika, Jai Bhim director

ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బ తీశాయని, తమ కులాన్ని, వృత్తిని కించపర్చేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని వారు పిటిషన్ లో తెలిపారు. గురువారం ఆ పిటిషన్‌ను విచారించిన సైదాపేట్‌ కోర్టు సూర్యతోపాటు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన సతీమణి జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. జస్టిస్‌ చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై (2021 నవంబరు 2), విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆస్కార్‌ పోటీల్లోనూ నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసుపై సూర్య, జ్యోతిక ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Court orders FIR against Suriya, Jyothika, Jai Bhim director

కాగా ఈ సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకుంది. తాజాగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలింగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *