ఆర్ ఆర్ ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇండియన్ సిల్వర్‌పై ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి మరోసారి తెలుగు సినిమా స్థాయిని మరోసారి భారతదేశానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1000 కోట్లకుపైగా రాబట్టి వసూళ్ల సునామి సృష్టించింది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వెండి తెరపై చూసిన ప్రేక్షకులు సైతం మరోసారి డిజిటల్ స్క్రీన్‌పై సినిమా చూసేయాలనే ఆతృతతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ5, నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 20 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కి సబ్స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి. ఇక, జూన్ 3 నుంచి ఆయా స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం. దీనిపై జీ5, నెట్‌ఫ్లిక్స్‌ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు మంచి ఆదరణ లభించింది. RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1122.30 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లతో దూకుడు మీదుంది.