ఓటీటీలో రాధేశ్యామ్… ఎప్పటి నుంచి అంటే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సక్సస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే కలిసి చేసిన రాధే శ్యామ్. ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 11 వ తేదీన పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఓ వర్గం ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయినప్పటికీ.. బీ,సీ ఆడియన్స్‌కి సినిమా నచ్చలేదు. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. విధికి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. జస్టిన్ ప్రభాకరన్ సాంగ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హస్తసాముద్రికా నిపుణుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెరపై ప్రభాస్-పూజా హెగ్డేల కెమెస్ట్రీ, పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
కాగా ప్రస్తుతం నిర్మాతలు ఓటీటీ సంస్థలతో పెట్టుకున్న డీలింగ్ ప్రకారం.. థియేట్రికల్ రిలీజ్ అనంతరం నాలుగు వారాల తరువాతే డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల కావాలి. అంటే ఏప్రిల్ 11న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సివుంది. కానీ ‘రాధేశ్యామ్’ సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో విడుదల కానుంది. ఉగాది కానుకగా ఏప్రిల్ 1నుంచి ‘రాధేశ్యామ్’ అమెజాన్ ప్రైంలో స్ట్రీమ్ అవ్వనుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో చూడాలి.