రంగురంగుల అరుదైన చేప.. పిక్ వైరల్ .!
ఈ ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి. దేనికి అవే ప్రత్యేకం. అలానే సముద్రంలో కూడా ఎన్నో రకాలైన జీవులు బతుకుతున్నాయి. వాటిలో మానవులు చాలా వాటిని కనిపెట్టారు. అయితే వాటిలో అందరికి తెలిసినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అన్నింటిని గుర్తించలేరు. ఇటీవల ఇప్పటి వరకు గుర్తించని ఓ అరుదైన జాతి చేపను గుర్తించారు శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకువచ్చిన కొత్త చేపను మల్దీవుల్లో గుర్తించారు. ఈ చేప చూసేందుకు చాలా అందంగా ఉందని అంటున్నారు. ఇతర చేపలకు లేని రంగులు ఈ చేపలు ఉన్నాయని చెప్తున్నారు.
కొత్తగా గుర్తించిన ఈ చేపకు సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని పేరు పెట్టారు పరిశోధకులు. నిజానికి ఈ చేప చూసేందుకు చాల అందంగా గులాబీ రంగులో ఉంటుంది. అయితే ఇలాంటి చేపను 1990ల్లో గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. దీనిని గుర్తించిన క్రమంలోనే పరిశోధకులు మరో చేపను కూడా గుర్తించారు. అది ముసలి చేప. దానికి సిర్రిలాబ్రస్ రుబ్రుస్క్వామిస్ అనే పేరు పెట్టారు.
కొత్తగా గుర్తించిన ఈ చేపలను అత్యంత అరుదైన చేపలుగా చెప్తున్నారు. ఈ చేపకు సంబంధించిన పరిమాణం చూసిన పరిశోధకులు షాక్ అయ్యారు. ఇది చాలా చిన్నగా ఉండి ముద్దుగా ఉంటుందని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనిని చూసిన చాలా మంది తెగ షేర్ చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు.