పిల్లలకు పాఠాలు నేర్పిన టీచర్.. రోడ్డుపై ఇలా..!
కరోనాకు ముందు ఆమె ఓ ఉపాధ్యాయురాలు. ఓ ప్రముఖ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవారు. ఉదయాన్నే బడికి వెళ్లి… పిల్లలకు విద్యార్థులు నేర్పేవారు. కానీ కరోనా మహమ్మారి ఆమె పరిస్థితి తలకిందులు చేసింది. చేతిలో ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆలోచనతో ఆమె… తన ఫ్యామిలీకి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోగలుగుతున్నారు. తనకు ఇష్టమైన వంట చేయడాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు. ఇప్పుడు ఆనందంగా గడుపుతున్నారు.
దిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు సుమన్ అనే మహిళ. టీచర్ గా చాలామంది విద్యార్థులకు పాఠాలు నేర్పారు. అయితే కరోనా వల్ల ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. ఏం చేయాలో తెలియని స్థితిలో కొన్నాళ్లు సతమతమయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఇష్టంగా చేసే వంటలే ఇప్పుడు ఆమెకు ఆధారమయ్యాయి. మంచి మంచి వంటకాలను తయారుచేస్తూ… రోడ్ సైడ్ స్టాల్ ఏర్పాటు చేసి ఆమె విక్రయిస్తున్నారు. చవకైన ధరకు కడుపు నిండా అన్న పెట్టి పంపిస్తున్నారు.
కాగా ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని… ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని సుమన్ అంటున్నారు. తన ఫ్యామిలీని కూడా బాగా చూసుకోగలుగుతున్నానని పేర్కొన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని… కష్టపడితే ఏ పని చేసైనా సక్సెస్ అవొచ్చని ఆమె చెబుతున్నారు. అందుకు తాను ఈ మార్గాని ఎంచుకున్నట్లు తెలిపారు. జీవితం ముందుకు సాగాలంటే చేయక తప్పడం లేదని అంటున్నారు. అయితే రోడ్ సైడ్ స్టాల్ లో ఫుడ్ సర్వ్ చేస్తున్న ఆమె వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారాయి.