బీచ్​ లో పడిన హెలికాప్టర్​… వీడియో వైరల్​!

ఓ హెలికాప్టర్​ బీచ్​లో కూలిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్​ గా మారింది. సాధారణంగా ఇప్పటి వరకు అయితే మనం హెలికాప్టర్​ క్రాష్‌ లాంటివి చూశాము. వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా మనం విన్నాం. ఒక్కొక్క దాని వెనుక ఒక్కొక్క కథ ఉంటుంది. కారణాలు ఏవైనా కానీ లక్షలు వెచ్చించి తయారు చేసే హెలికాప్టర్​ అనేది కుప్ప కూలడం అనేది దారుణం.

ఇటీవల బ్రిటన్​లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దీనికి కారణం యూనిస్‌ తుపాను. వచ్చినప్పుడు గాలులు భారీగా వీచాయి. అయితే ఈ భారీ ఈదురు గాలుల కారణంగా ఓ విమానం చాలా ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆ బీభత్సానికి విమానం నడుపుతున్న పైలట్లు ప్రమాదకరంగా ల్యాండ్‌ చేశారు. ఇలాంటి ఘటన లాంటిదే బీజ్​లో హెలికాప్టర్ పరిస్థితి కూడా. దానిలో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా అందరూ చూస్తుండగానే ఆ సముద్ర తీరంలో పడిపోయింది. ఆ సమయంలో అలలపైకి దూసుకవచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ హెలికాప్టర్​ కుప్పకూలిన ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా. ఇదీ చాలా రద్దీగా ఉండే బీచ్​. మియామీ బీచ్‌లో ముగ్గురు ప్రయాణికులతో ఈ హెలికాప్టర్​ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీనిని రాబిన్సన్ R44 హెలికాప్టర్ గా అధికారులు గుర్తించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన దాని ప్రకారం నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రాష్​ లో బీచ్​ లో పడిన ఆ హెలికాప్టర్ విడి భాగాలను తరలించారు. ఇందులో ఉన్న సిబ్బంది గాయపడగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *