పచ్చి టమాటోలను తీసుకుంటున్నారా అయితే ఏం జరుగుతుందో తెలుసా?
Green Tomatoes: ఎర్రగా ఉండే టమాటోలను మనం తినడానికి ఎక్కువగా ఇష్టపడతాము. వాటిని మనం వంటలలో వాడుతుంటాము. నిజానికి ఇది వంటలలో నిత్యం ఉపయోగమైనది. ఎర్రగా ఉండే టమాటోలను తీసుకోవడం వల్ల మంచి పోషకాలు కలుగుతాయని వైద్యులు తెలుపుతూ ఉంటారు. ఇక పచ్చి టమోటోలను తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకూ అవేంటంటే..
టమాటోలలో ఎక్కువగా విటమిన్ ‘సి’ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి, చర్మ కాంతికి కూడా బాగా సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తిను పెంచుతాయి.
అంతే కాకుండా ఇన్ఫెక్షన్ నుండి విముక్తి కలిగిస్తాయి. పచ్చి టమాటోలలో మనకు కావలసిన బీటాకెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. పచ్చి టమాటోలను తినడం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పచ్చి టమాటోలలో మన శరీరానికి కావలిసిన సోడియం తక్కువగా, పోటాయం ఎక్కువగా అందుతుంది.
అంతేకాకుండా ఈ టమాటోలు తినడం వల్ల అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. అలాగే శరీరానికి కావాలసిన పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి మీ రోజువారి తినే పదార్థాలు టమాటోలను కూడా చేర్చుకోవడం మంచిది.