శీతాకాలంలో గుండె సమస్యలు రావడానికి కారణం ఏమిటో తెలుసా?
Health Tips: ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా గుండె జబ్బులు మరింత పెరుగుతున్నాయి. ఈ గుండె పోటుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ గుండె పోటు శీతాకాలంలో ఎక్కువగా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
తగిన దుస్తులు ధరించడం: మీకు గుండెపోటు ప్రమాదం ఉన్నట్లయితే మీరు మంచి దుస్తులు ధరించాలి. అనగా మిమ్మల్ని మీరు చలి నుండి కాపాడుకునే దుస్తులను ధరించాలి. కాలుష్యం వల్ల పెరిగే కాలం ప్రకారంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి కూడా ఇది మంచి మార్గం.
శారీరకంగా చురుకుగా ఉండటం: చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల చాలా మంది ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఇష్టపడరు. అటువంటి సమయంలో వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.
ఇలా తరచుగా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గించడం లో, ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇక యోగ, ధ్యానం వంటివి చేయడం మంచిది.
ఆహారపు అలవాట్లు: శీతాకాలంలో ఎక్కువగా ఆకలి ఉంటుంది. అలాంటి సమయంలో వేయించిన పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి అవి మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెంచుతాయి. కాబట్టి అలా తినడం మంచిది కాదు.
కాబట్టి వీలైనంత హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మద్యం, పొగాకు వంటి అలవాట్లను దూరం పెట్టాలి. ఇక శీతాకాలంలో తరచూ గుండెకు సంబందించిన లక్షణాల గురించి వైద్యులు దగ్గర పరీక్షలు చేసుకోవాలి.