ఉల్లి చేసే ప్రయోజనాలు ఇవే..!

తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని ఓ సామెత ఉంది. కానీ అది సామెతకే పరిమితం కాదు..నిజంగానే ఉల్లి మనిషికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఉల్లిపాయ(ఉల్లిగడ్డ)లను నిత్యం కూరల్లోవినియోగించుకుంటారు. అంతేకాదు బిర్యానీ లాంటివి తినేటప్పుడు కాస్త టచ్ చేస్తారు. అయితే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా పచ్చి ఉల్లిపాయ తినలేరు. కానీ దాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం…రోజుకు 50 గ్రాముల ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి. ఉదయం పచ్చిది తిన్నా సరే..అన్నంలో తిన్నా సరే..పచ్చిది మాత్రమే తినాలి.

50 గ్రాముల పచ్చి ఉల్లపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. 7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి. పచ్చి ఉల్లిపాయతో పచ్చి పులుసును చేసుకుని అన్నంతో తిన్నా సరిపోతుంది. ఉల్లిపాయను సన్నని ముక్కులుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతే మత్రంలో మంట కూడా తగ్గిపోతుంది.

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి, దానికి చిటికెడ్ నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి. పచ్చి ఉల్లిపాయను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రతు సమస్య తగ్గిపోతుంది. అదే పురుషులకు వీర్య కణాల సమస్య పోతుంది. సెక్స్ విషయంలోనూ హుషారుగా ఉంటారు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బీపీ, గుండెపోటు, అస్తమా, అలర్జీలు, దగ్గు, జలుబు, నిద్రలేని సమస్య, స్తూలకాయం వట్ సమస్యలు రావు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *