చలికాలంలో మీ పిల్లల రోగనిరోధక శక్తి పెరగాలా అయితే ఇవి తినిపించండి!
Child Immunity : సాధారణంగా పిల్లలకు శీతాకాలం అనేది ఆరోగ్య పరంగా పెద్దగా సపోర్ట్ చెయ్యదు. ఈ కాలం లో మంచు ఎక్కువగా ఉండటం వలన జలుబు, దగ్గు, నిమ్ము వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో కొన్ని ఆహారపదార్ధాలు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం మంచిది అని తెలుస్తుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెల్లుల్లి: వెల్లుల్లి లో ఎక్కువగా ఉండే అల్లిసిన్ పిల్లలలో జలుబు, దగ్గు, సాధారణంగా వచ్చే జ్వరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి పిల్లలు తినే ఆహారంలో తగినంతగా వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి.
క్యారెట్లు: క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ ఇది శీతాకాలం లో రక్తం లో తెల్ల రక్త కణాల స్థాయిని మెరుగు పరుస్తుంది. పిల్లల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా క్యారెట్ లో అధికంగా ఉండే ఫైబర్ పిల్లల జీర్ణవ్యవస్థను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఖర్జూరం: ఖర్జూరం లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో పిల్లలు వెచ్చగా ఉండటంలో సహాయపడుతాయి. అదీ కాకుండా ఖర్జూరాలను తరచూ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి జీవక్రియను మరింత ప్రేరేపిస్తాయి.
సిట్రస్ పండు: సిట్రస్ పండ్లు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక పిల్లలకు శీతాకాలంలో తరచూ గుడ్లు తినిపిస్తూ ఉండటం మంచిది.