భార్యాబిడ్డలను వదిలేసిన భర్త.. చివరికి ఊహించని ట్విస్ట్ తో?
కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో అవి విడాకులకు కూడా దారి తీస్తుంటాయి. ఇక విడాకులు వచ్చాక ఎవరికి వారు దారులు చూసుకుంటారు. అలా ఓ ఆస్ట్రేలియా వ్యక్తికి కూడా తన భార్యతో మనస్పర్ధలు రావటంతో చివరికి విడిపోయారు. కానీ అతడికి అసలు ట్విస్ట్ ఇచ్చింది కోర్టు.
అతడి పేరు నోమ్ హప్పెర్ట్. ఆస్ట్రేలియాకి చెందిన వాడు. ఇక ఈయన ఇజ్రాయిల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు కూడా ఉండగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా చట్టప్రకారం వారిద్దరి విడాకులు తీసుకున్నారు.
ఇక విడాకులు తీసుకున్నాక ఆమె తన పిల్లలతో తనను ఇజ్రాయిల్ లో దింపమని కోరింది. ఇక నోమ్ వారిని దింపటానికి 2012లో వెళ్లాడు. తిరిగి తాను సొంత దేశానికి పయనమవుతున్న సమయంలో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. కారణం ఏంటంటే.. అతడు పెళ్లి చేసుకొని పిల్లలను కని అలా వదిలేసి వెళితే మరి బాధ్యతలు ఎవరు చూసుకుంటారని కోర్టు నిలదీసింది.
దీంతో అతడికి శిక్ష కూడా విధించింది. అదేంటంటే 9999 సంవత్సరం వరకు ఇజ్రాయిల్ లోనే ఉండాలని కుదరకపోతే పిల్లల్ని పోషించేందుకు రూ.22.74 కోట్లు చెల్లించాలని కండిషన్ పెట్టింది. ఇక అతడు అన్ని డబ్బులు కట్టలేక చివరికి అక్కడే ఉండిపోయాడు. దీంతో అతడు ఇజ్రాయిల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పయిందని వాళ్ళు ఇలాంటి శిక్షణ ఇవ్వడం సరైనది కాదని సీరియస్ అవుతున్నట్లు తెలిసింది.