వామ్మో.. అతడు మామూలోడు కాదు.. ఏకంగా 27 గంటలు అందులో అలా!
మనం సినిమాలలో హీరోలు చేసే సాహసాలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఇతరుల ప్రాణాలు కాపాడటానికి, తమ ప్రాణాలు రక్షించడానికి బాగా కష్ట పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సినిమాలలో సముద్రంలో పడిన వారిని కాపాడటానికి లేదా తమను తాము రక్షించుకోవడానికి ఈదడం వంటివి, మరి ఏమైనా ప్రయత్నాలు వంటివి చేస్తుంటారు. ఇక ఇదే తరుణంలో రియల్ లైఫ్ లో వావ్ అనిపించాడు ఓ వ్యక్తి.
గత శనివారం పసిఫిక్ మహా సముద్రంలో టాంగాలోని ఫొనాఫూ దీవుల్లో అగ్ని పర్వతం బద్ధలైంది. అందువల్ల ఈ క్రమంలో అక్కడ సునామి ఏర్పడింది. ఆ సమయంలో రోజూ లాగే ఆటాటా అనే దీవిలో జీవిస్తున్నాడు లిసాల. ఆరోజు అతను ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఉండటంతో.. అతని దగ్గరకు అతని సోదరుడు వచ్చి సునామీ వస్తుందని జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. దానికి లిసాలా సరే అని అన్నాడు.
ఇంతలో భారీ అలలు రావడంతో.. దాంతో లిసాలా చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు. అలలు వెళ్ళిపోయిన వెంటనే ఏడు గంటల భారీ సునామీ వచ్చింది. ఇక లిసాలా అలలలో కొట్టుకుపోయాడు. ఇందులో బాధపడాల్సిన విషయం ఏమిటంటే 57 సంవత్సరాల లిసాలా దివ్యాంగుడు కాబట్టే సునామీ వచ్చిన సమయంలో తప్పించుకోలేకపోయాడు.
అయినా కూడా ఆ సునామి కి ఏ మాత్రం భయపడకుండా సముద్రంలో అతను 7.5 కిలోమీటర్లు ఈదాడు. ఎట్టకేలకు టోంగాతాపు దీవికి చేరాడు. మొత్తం ఇరవై ఏడు గంటలు ఈదాడు అతను. ఆ వ్యక్తి ఒక్క క్షణం ఈత మానేసిన పూర్తిగా సముద్రంలో కలిసి పోయేవాడు. పెద్ద పెద్ద తిమ్మింగలాలు, సార్కు చేపలతో కూడి ఉన్న ఆ సముద్రంలో తెల్లవార్లు మృత్యువుతో పోరాడాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.