త్రిష హాట్ ఎంఎంఎస్ అంటూ ప్రముఖ మీడియాలు సైతం దుష్ప్రచారం
December 14, 2016
ప్రముఖ నటుడు కమలహాసన్, నటి త్రిష పోలీసు ఏజెంట్లుగా నటించిన చిత్రం “తూంగవనం”, తెలుగులో “చీకటి రాజ్యం” పేరుతో విడుదల అయింది. ఈ చిత్రం ప్రధానంగా ఓ పబ్, అందులో జరిగే అసాంఘిక కార్యక్రమాల నేపథ్యంలో సాగుతుంది. హీరో కొడుకుని విలన్లు కిడ్నాప్ చేయగా కమలహాసన్ అనుమదాస్పదంగా ప్రవర్తించే పరిస్థితులు ఆ సినిమాలో ఉంటాయి. పోలీసే అయిన హీరోయిన్ త్రిష హీరో కమలహాసన్ ను వెంటాడుతుంది. దీంతో పబ్ లోని కిచెన్ లో వీరి మధ్య పోరాట సన్నివేశం ఉంటుంది. ఆ పోరాటంలో త్రిష చేయిని వెనక్కి తిప్పి హీరో ఒడిసి పట్టుకుని ఎముకులు విరిగేలా నలుపుతూ ఉండగా హీరోయిన్ త్రిష బాధతో ముఖ కవళికల్లో తన అభినయాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు ఆ వీడియోలో వెనకన ఉన్న కమలహాసన్ ను క్రాప్ చేసేసి సౌండ్ కూడా లేకుండా కేవలం త్రిష ముఖ కవళికలను చూపిస్తూ ఇది త్రిష హాట్ వీడియో అంటూ కొందరు ప్రబుద్ధులు యూ ట్యూబ్ మరియు ఇతర సామాజిక వెబ్ సైట్ లలో ఉంచారు. అంతే అది వైరల్ గా మారింది. దీనిలో నిజానిజాలు ఏంటో బేరీజు వేసుకోకుండా ప్రముఖ మీడియా వెబ్ సైట్ లు, పత్రికలు సైతం గతంలో పలు సార్లు త్రిష ఎంఎంఎస్ ల బారిన పడింది, ఇప్పుడు మరో ఎంఎంఎస్ లో చిక్కిందా అంటూ కథనాలను వడ్డిస్తున్నాయి. మొత్తమ్మీద త్రిష పై దుష్ప్రచారం జోరుగా సాగుతున్నది. దీనికి ఫుల్ స్టాప్ పడేదేప్పుడో!!