ఈ శృంగార ఔషధంతో కరోనా వైరస్ కు చెక్…?
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజల జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. మరణాల రేటు తక్కువగానే ఉన్నా జనాల జీవనంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఈ వైరస్ నుంచి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులోకి వస్తూ వైరస్ పై భయాన్ని కొంతవరకు తగ్గిస్తున్నాయి. తాజాగా అంగస్తంభన సమస్య కోసం వినియోగించే ఆర్‌ఎల్‌ఎఫ్-100 కరోనాను కరోనా వైరస్ పై పోరాడటంలో అద్భుతంగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అవిప్టడిల్ అని మరో పేరుతో పిలిచే ఈ ఔషధాన్ని అమెరికాలోని కొంతమంది రోగులకు ఇవ్వగా వాళ్లు వైరస్ నుంచి త్వరగా కోలుకున్నారు. వెంటిలేటర్ పై ఉన్న రోగులపై సైతం ఈ ఔషధం అద్భుతంగా పని చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. అమెరికా ఎఫ్‌డీఏ కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వ్యక్తులపై ప్రయోగించడానికి ఈ ఔషధానికి అనుమతులు ఇచ్చింది. మరికొన్ని కంపెనీలు కూడా ఈ వైరస్ పై ప్రయోగాలు చేసి పూర్తిస్థాయిలో ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.