ఆదర్శప్రాయులు ఉన్నం బసవయ్య
November 16, 2016
సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు, గతంలో మూడు సార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన కామ్రేడ్ ఉన్నం బసవయ్య అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందారు. ఆయన మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించి ఆయన అభీష్టం మేరకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం నారాయణ వైద్య కళాశాలకు దేహాన్ని దానం చేసారు. ఆయన భౌతికదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఇప్పుడు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న విజయమహల్ బాక్స్ టైపు బ్రిడ్జి బసవయ్య కృషే అని ఈ సందర్భంగా తెలియజేసారు. సారా వ్యతిరేక ఉద్యమంలో బసవయ్య కీలక పాత్ర పోషించారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర కార్యదర్శి మూలం రమేష్, నాయకులు శ్రీరాములు, మోహనరావు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.