సాయంత్రం 4 గంటలకు పవన్ సభ – 1800 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు – 600 మంది జనసేన కార్యకర్తల సేవలు

జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభపేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ నేటి సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోప్రారంభం కానుంది. న్యూటౌన్ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో జరగనున్న ఈ సభకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసారు. కాకినాడ సభలో జరిగిన దురదృష్టకర పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లు చేసారు. మొత్తం 1800 మంది పోలీసులు విధుల్లో నిమగ్నమయ్యారు. 600 మంది జనసేన కార్యకర్తలు వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభలో మునుపటి సభలోలాగా భారతీయ జనతా పార్టీ పైదుందుడుకు వైఖరి అవలంభిస్తారా లేక 500 మరియు 1000 నోట్ల రద్దు నేపథ్యంలో ఆ పార్టీ కి ప్రజల్లో పెరుగుతున్న సానుకూలతకు అనుగుణంగా వ్యవహరిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు పెద్ద నోట్ల రద్దు పై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏమిటి, ఆయన ఎలా దాని గురించి స్పందిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సమీప జిల్లాల నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా అనంతపురం తరలివెళ్లారు. జనసేన అధినేత ఏమి మాట్లాడతారా అని అనేక మంది సాయంత్రం 4 గంటలకు తమ టీవీలకు అతుక్కుపోనున్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *