మున్సిపల్ కార్పొరేషన్ కు నూతన కమీషనర్ సామలూరు హరీష్

నెల్లూరు మున్సిపల్ కమీషనర్ మళ్ళీ మారారు. నూతన పాలకవర్గం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో జాన్ శ్యాంసన్, చక్రధర్ బాబు, పీవీవీఎస్ మూర్తి తాజాగా కె.వెంకటేశ్వర్లు ఇలా అందరూ ఛార్జ్ తీసుకున్న కొద్ది నెలల్లోనే మారిపోయారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణకు ఎవ్వరి పనితీరు నచ్చకపోవడంతో ఇలా బదిలీలు అయిపోతున్నారు. రొట్టెల పండుగ నిర్వహణ సందర్భంగా మంత్రి నారాయణ మునిసిపల్ శాఖ పనితీరుపై అసహనం వ్యక్తం చేసారు. ఫలితం ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వర్లు 10 నెలలు గడిచాయో లేదో బదిలీ అయిపోయారు. ఆయన తదుపరి పోస్టింగ్ కోసం గుంటూరు లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో నూతన కమీషనర్ గా సీసీఎల్ఏ లో అసిస్టెంట్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న సామలూరు హరీష్ ను నియమిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. నూతన పాలకవర్గంలో అయిదో కమీషనర్ గా బాధ్యతలు చేపడుతున్న ఈయనైనా మున్సిపల్ పనితీరును మెరుగుపర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *