మహేష్ బాబు నూతన చిత్రం ప్రారంభమైంది

‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్‌ మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 9 ఉదయం 10.26 గం.లకు రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా మరో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 

ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – ”శ్రీమంతుడు లాంటి సూపర్‌ మూవీ తర్వాత మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో శ్రీమంతుడు కంటే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తీస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా వుంటుంది. ఇందులో మహేష్‌బాబు ఇంతకుముందు పోషించని ఒక వైవిధ్యమైన పాత్రను చేస్తున్నారు. హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది. ముఖ్యపాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రవి కె.చంద్రన్‌, దేవిశ్రీప్రసాద్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌తో చాలా పెద్ద రేంజ్‌లో దానయ్యగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు” అన్నారు.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – ”మహేష్‌బాబు గారితో ఓ సెన్సేషనల్‌ మూవీ చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. వరసగా ఘనవిజయాల్ని అందిస్తున్న కొరటాల శివగారి దర్శకత్వంలో ఇంత మంచి సినిమా చేస్తున్నందుకు గర్వంగా వుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ – ”వరసగా కొరటాల శివగారి సినిమాలన్నీ చేయడం చాలా ఆనందంగా వుంది. మహేష్‌బాబుగారితో చేసిన శ్రీమంతుడు ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ఇది శ్రీమంతుడు కంటే పెద్ద కథ. అలాగే శ్రీమంతుడు కంటే ఆడియో పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌ మాట్లాడుతూ – ”మూడేళ్ళ క్రితం ట్విట్టర్‌లో నా అభిమాన హీరో మహేష్‌ అని ట్వీట్‌ చేశాను. ఇప్పుడు మహేష్‌తో కలిసి వర్క్‌ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది. మహేష్‌, కొరటాల శివగార్ల కాంబినేషన్‌లో ఈ చిత్రం టెక్నికల్‌గా హై రేంజ్‌లో వుంటుంది. ఇంతకుముందు నేను ఎన్నో భారీ చిత్రాలు చేసినా కూడా నా అభిమాన హీరోతో చేస్తున్న ఈ సినిమాకి నూతనోత్సాహంతో వర్క్‌ చేస్తాను” అన్నారు.

డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ ప్రెస్టీజియస్‌ మూవీకి టైటిల్‌ ఇంకా నిర్ణయించలేదు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *