ప్రైవేట్ ఆస్పత్రులకు సీటీ స్కాన్ కోసం వెళ్లే వాళ్లకు షాకింగ్ న్యూస్…?
ఒకవైపు కరోనా మహమ్మారి దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిసున్నాయి. ఇలాంటి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు ఏ వ్యాధితో ఆస్పత్రికి వెళ్లినా రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లిన వాళ్లను మొదట సీటీ స్కాన్ చేయించుకోవాలని చెబుతూ ఒక్కొక్కరి నుంచి 8,000 రూపాయల నుంచి 10,000ర్ రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.
నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐ.సీ.ఎం.ఆర్ కరోనా నిర్ధారణ కోసం ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీ పీసీఆర్ పరీక్ష్లలను మాత్రమే సూచిస్తున్నాయి. ఈ రెండు పరీక్షలలో నెగిటివ్ వచ్చి కరోనా తీవ్ర లక్షణాలు ఉంటే మాత్రమే సీటీ స్కాన్ చేయించుకోవాలని చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా చెబుతూ ఉండటంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చేస్తున్న ఈ తరహా మోసాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.