పాపులర్ అయిన బిచ్చగాడు – 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు ఇతని పుణ్యమే అంటున్న నెటిజన్లు

 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు వెనుక ఒక బిచ్చగాడు కీలక పాత్ర పోషించాడని నెటిజన్లు సోషల్ మీడియా సైట్ లలో సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన తమిళ అనువాద చిత్రం  ‘బిచ్చగాడు’ లో హీరోకి తోడుగా నిలిచే ఓ బిచ్చగాడు ఓ రేడియో ఛానెల్ లైవ్ లో అవినీతి అంతం గురించి మాట్లాడుతూ 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తేనే దేశం లో అవినీతి తగ్గి పేదరికం అంతమవుతందని తెలియజేస్తాడు. 80 శాతం పెద్ద నోట్లు నల్ల ధనం రూపంలో చెలామణి అవుతుండగా కేవలం 20 శాతం మాత్రమే సక్రమమైన మార్గాల్లో ఉందంటూ ఆ బిచ్చగాడు వాస్తవాలను పేర్కొంటాడు. పెద్ద నోట్లను రద్దు చేస్తే నల్లధనం కల్గిన వారు ఉక్కిరిబిక్కిరి అవుతారని తెలియజేస్తాడు. రేడియో ప్రోగ్రాంలో ఉన్న ఆర్థికవేత్త ఇతను బిచ్చగాడు అని తెలియక బహుశా ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చదివుంటారని ఇతనికి దేశ ప్రధాని అయ్యే అర్హత ఉందని పేర్కొనడం కొసమెరుపు. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *