పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్

నేను శైలజ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మళయాల బ్యూటీ కీర్తీ సురేశ్ తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని కీర్తీ సురేశ్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Very happy to announce my next Telugu film with @PawanKalyan sir Director #Trivikram sir, Production @HaarikaHassine @anirudhofficial 😊🙏🏻

— Keerthy Suresh (@KeerthyOfficial) November 16, 2016

నా నెక్ట్స్ తెలుగు మూవీ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు అంటూ…. చేతులెత్తి నమస్కరిస్తున్న సింబల్ తో ట్వీట్ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *